CM KCR : కేంద్రంపై జంగ్..! బండికి రివర్స్ కౌంటర్..!! కేసీఆర్ కౌంటర్ ప్రెస్‌మీట్ డే-2 స్పీచ్ హైలైట్స్ ఇవే | Telangana CM KCR Counter Press meet Day 2 Highlights

CM KCR : కేంద్రంపై జంగ్..! బండికి రివర్స్ కౌంటర్..!! కేసీఆర్ కౌంటర్ ప్రెస్‌మీట్ డే-2 స్పీచ్ హైలైట్స్ ఇవే

తగ్గేదే లే... బ్యాటిల్ కంటిన్యూస్ అంటూ ముగించారు సీఎం కేసీఆర్.

CM KCR : కేంద్రంపై జంగ్..! బండికి రివర్స్ కౌంటర్..!! కేసీఆర్ కౌంటర్ ప్రెస్‌మీట్ డే-2 స్పీచ్ హైలైట్స్ ఇవే

CM KCR Counter 2 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండోరోజు హైదరాబాద్ బేగంపేటలోని ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి సహా.. ఇతర నేతలు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సంజయ్ ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. బండి సంజయ్ లక్ష్యంగా కేసీఆర్ విసిరిన పంచ్ డైలాగులు… కేంద్రం తీరుపై చేసిన విమర్శలు చేస్తూనే.. దేశ ప్రగతిపై కేసీఆర్ ఆలోచనలు పంచుకున్నారు. వాటిలో హైలైట్స్ ఇవీ.

CM KCR Day 2 Counter Press Meet High Lights

బండి సంజయ్ వడ్ల గురించి తప్ప మిగతా అంతా సొల్లు మాట్లాడాడు

బండి సంజయ్‌ది అంతా సొల్లు పురాణమే

ప్రశ్నిస్తే దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారు

అబద్ధాల మీద బతికే పార్టీ బీజేపీ

ఒకటే అడుగుతున్నాం.. డైరెక్ట్ గా చెప్పండి తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా..? కొనదా..?

రాయలసీమకు నీళ్లు రావాలని కోరుకుంటున్నాం

పక్క రాష్ట్రంలో చేపల పులుసు తింటే తప్పా..?

ఈ బీజేపీ కిరికిరి గాళ్లు, సబ్జెక్ట్ లేనోళ్లతోని అయ్యేదేం లేదు

తెలంగాణలో వరి పంట ఎంత పండిందో చూడండి. రండి.. ఆరు హెలికాప్టర్లు పెట్టి తిప్పి చూపిస్తం

తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఏడున్నడు..?

బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంట్ అంటే తెలుసా నీకు

తెలంగాణకు నేనేం చేశానని నువ్వు అడగడం మిలీనియం జోక్

ఇక తగ్గేది లేదు.. అంతు చూస్తాం.. ప్రతిరోజూ ప్రెస్‌మీట్ పెడతా

గొర్ల పథకంలో కేంద్రం పైసా ఉన్నా సీఎం పదవికి రాజీనామా చేస్తా

బీజేపీ పాలిత ఒక్క రాష్ట్రంలోనైనా రూ.2వేల పెన్షన్ ఇస్తున్నారా..?

బీజేపీవి దొంగ లెక్కలు.. దొడ్డిదారిన ప్రభుత్వాలు

మేం 2 సార్లు బాజాప్తా గెలిచాం.. 107 అసెంబ్లీ సీట్లలో మొన్న బీజేపీకి డిపాజిట్ రాలే

దేశద్రోహి స్టాంప్… ఈడీ రైడ్స్.. ఇదే బీజేపీ స్టైల్

పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్లు లేరు

దళితుడిని సీఎం చేయలేదనేది వాస్తవం

దళితుడు తెలంగాణకు సీఎం ఎందుకు కాలేదో షబ్బీర్ అలీకి తెలుసు

ఉద్యమంలో అడ్రస్ లేని పార్టీ బీజేపీ

తెలంగాణలో ఏ మూలకు పోయినా నేను గెలిచిన

గొర్ల పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదు?

కేంద్రం చెప్పిన ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

ఉద్యమంలో కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయాడు

కరోనా టైంలో ప్రైవేటు స్కూళ్ల సిబ్బందిని తెలంగాణ మాత్రమే ఆదుకుంది

పెట్రోల్ వ్యాట్ రేషనలైజ్ చేశాం.. పెంపు అనేది అబద్ధం

మా ప్రాణం పోయేవరకు తెలంగాణ కోసమే కొట్లాడతాం

దేశ ఖజానా మీ అయ్య సొత్తు కాదు

నా ఫాంహౌజ్ దున్నుతవా.. ట్రాక్టర్ డ్రైవర్‌వా నువ్వు..?

నాకు కంపెనీలు లేవు.. దందాలు లేవు.. నన్ను ఏం చేయలేరు..?

సూట్ కేసులు ఇచ్చింది మీరు.. నేను కాదు

ఎన్నికలొస్తే అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ మీది కాదా..?

నువ్ నాకు ఎప్పుడైనా మందు పోసినవా..? మందు కలిపినవా..? చూసినట్టు మాట్లాడుతున్నవ్..?

నాది ఫాం హౌజ్ కాదు.. ఫార్మర్ హౌజ్. మీలా గెస్ట్ హౌజ్ లు లేవు

ప్రాజెక్టుల్లో మాది, మా అత్తగారోళ్ల భూములు పోయినయ్

వ్యవసాయం చేసుకుని బతకడం తప్పా..?

సిద్దిపేటలో జాగా అమ్ముకుని ఫాంహౌజ్ కట్టుకున్నా

ఫాంహౌజ్ లో అడుగుపెడితే ఆరు ముక్కలు అవుతావు

తెలంగాణలో ఏ పాత్ర అయినా పోషిస్తాం

గెలిస్తే గంభీరంగా ఉంటాం

వరి కేంద్రమే కొనాలి డిమాండ్ తో వచ్చే శుక్రవారం(నవంబర్ 12, 2021 ) అన్ని నియోజకవర్గాల్లో ధర్నా

దళిత బంధు వందశాతం అమలు చేస్తాం

ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నడూ చెప్పలేదు

2,3 రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం

ఏటా ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తాం

వడ్ల ఇష్యూలో రైతుల ముందు బీజేపీని పంచనామా చేస్తాం

పెట్రోల్, డీజిల్ అంతా పోయి ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతాయి

1980లో చైనా జీడీపీ మన కంటే తక్కువ

సింగపూర్‌లో మన్నును కూడా కొనుక్కుంటరు

దేశంలో కొత్త ఎకనామిక్ పాలసీ రావాలి

ఇండియాపై చైనా కొన్నేళ్లకిందే ఓ కమిటీ వేసింది. మతం రొచ్చులో ఉన్న ఇండియాతో మనకు త్రెట్ లేదని చైనా తేల్చుకుంది. మన దరిద్రం ఇదీ. బీజేపీ పొద్దున లేస్తే మతం అంటుంది.

చైనాలో ప్రతి ఒక్కరూ పని చేస్తారు.. మనలా కాదు

దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి

గాంధీని తిడితేనే దిక్కులేదు దేశంలో

ఇక ప్రతిరోజూ ప్రెస్ మీటే. 10న వరంగల్ లో కూడా మాట్లాడతా. బ్యాటిల్ కంటిన్యూస్.

 

×