Telangana : కాషాయ పార్టీపై కేసీఆర్ గర్జన.. కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా ఉంది

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి బహిరంగ సభలో అప్పటివరకూ కేంద్రాన్ని కడిగిపారేసిన సీఎం కేసీఆర్..... ఉన్నట్టుండి రాహుల్‌ గాంధీ పేరును ప్రస్తావించారు. మొన్న లోక్‌సభలో రాహుల్‌ గాంధీ...

Telangana : కాషాయ పార్టీపై కేసీఆర్ గర్జన.. కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా ఉంది

Cm Kcr

CM KCR : బీజేపీపై దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉధృతం చేశారు. ఢిల్లీ సెంటర్‌కు వినిపించేలా కాషాయ పార్టీపై గర్జిస్తున్నారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం అవినీతిని తెరపైకి తెచ్చారు. అలాగే రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రంలో జరిగే అవినీతి భాగోతాల చిట్టా తన చేతికొచ్చిందన్నారు. కేసీఆర్ బయల్దేరితే ఎంతవరకైనా వెళ్తాడని… బీజేపీ సంగతి దేశమంతా అన్ని భాషల్లో చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. మమతాబెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడానన్నారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలన్నారు సీఎం కేసీఆర్. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి భాగోతాలు చెబుతామన్నారు.

Read More : Mohan Babu : జీవితంలో రిస్కులు చేయాలి.. ఒక్క పాట కోసం చాలా ఖర్చుపెట్టాం

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి బహిరంగ సభలో అప్పటివరకూ కేంద్రాన్ని కడిగిపారేసిన సీఎం కేసీఆర్….. ఉన్నట్టుండి రాహుల్‌ గాంధీ పేరును ప్రస్తావించారు. మొన్న లోక్‌సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలకు అసోం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసభ్యకర కామెంట్స్‌ చేయడంపై సీఎం కేసీఆర్ అగ్గిమీదగుగ్గిలమయ్యారు. బీజేపీ సంస్కారం ఇదేనా..? మన హిందూ ధర్మం ఇదేనా? అని నిలదీశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా ఎప్పుడు బయట పెడతారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు సంజయ్.

Read More : IPL Auction 2022: CSK నుంచి LSG వరకు.. మొదటి రోజు వేలం తర్వాత జట్లు ఇవే!

దీనిపై తామే బహిరంగ సభ పెడుతామన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు బయటపడిందన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు హిమాంత బిశ్వ శర్మ స్పందించారు. రాహుల్‌గాంధీపై చేసిన కామెంట్లపైనే స్పందిస్తున్నారు మరి…ఆర్మీపై రాహుల్ చేసిన వ్యాఖ్యల గురించి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఈ ఆలోచన విధానం మారాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాల బాట పడుతున్నారు. 2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. యాదాద్రిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్స్‌ సూట్స్‌ ప్రారంభించిన అనంతరం సుదర్శన మహా యాగం కోసం ఏర్పాటు చేసిన యాగశాల పరిశీలించారు. భువనగిరిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. రాయగిరి వద్ద బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.