CM KCR : బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెబితే కిషన్‌రెడ్డి సిపాయే : సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. కేంద్రం ధాన్యం కొనమని చెప్పడంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతోపాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

10TV Telugu News

CM KCR : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. కేంద్రం ధాన్యం కొనమని చెప్పడంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతోపాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

యాసంగిలో మాకు బాయిల్డ్‌ రైసే వస్తాయని అవి తీసుకోమని కేంద్రానికి చెబితే కిషన్‌రెడ్డి సిపాయే అని వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణ ధాన్యం కొనాలని చెప్పే కేంద్రమంత్రి కావాలి.. ఇలాంటి కేంద్రమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బాయిల్డ్ రైసె వస్తాయని తేల్చి చెప్పారు. 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో పండే వడ్ల నుంచి రారైస్ తీస్తే బియ్యం కంటే నూకే అధికంగా వస్తుందని తెలిపారు కేసీఆర్.

చదవండి : CM KCR : యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు – సీఎం కేసీఆర్

ఇక ఇదే సమయంలో రైతులు ప్రత్యన్యాయ పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు కేసీఆర్. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రత్యమ్నాయ పంటలపై 40 పేజీలతో బుక్‌లెట్ విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ తెలిపారు.

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మద్దతు ధరల చట్టం బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతులకు కరెంట్ విద్యుత్ చార్జీలు విధించడాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇదే సమయంలో గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్లో కొట్లాడతామని తెలిపారు కేసీఆర్.

చదవండి : CM KCR : నాలుగో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు

 

×