CM KCR : బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ ప్రచారం..?

జాతీయ పార్టీలను వ్యతిరేకించే.. ప్రాంతీయ పార్టీలతో ఓ వేదికను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. యూపీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

CM KCR : బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ ప్రచారం..?

Kcr (2)

CM KCR focus on national politics : జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించారు. ముఖ్యంగా బీజేపీని ఓడించేందుకు సీఎం వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున కేసీఆర్‌ ప్రచారం చేసే అవకాశముంది. అవసరమైతే.. 5 రాష్ట్రాల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.

జాతీయ పార్టీలను వ్యతిరేకించే.. ప్రాంతీయ పార్టీలతో ఓ వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. యూపీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ బీజేపీ అధికారాన్ని కోల్పోతే.. జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు రూట్ క్లియర్ అవుతుందని.. కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో.. లోక్ సభ ఎన్నికల సమయంలో.. టీఆర్ఎస్-సమాజ్‌వాదీ పార్టీలు సహకరించుకున్నాయ్. అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ వచ్చి.. సీఎం కేసీఆర్‌తో భేటీ కూడా అయ్యారు.

Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2,68,833 పాజిటివ్ కేసులు

ఎస్పీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. యూపీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటే.. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఇతర పార్టీలు కూడా ప్రత్యామ్నాయ వేదికకు దగ్గరయ్యే అవకాశం ఉందని.. టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే.. వచ్చే రెండు నెలల్లో తెలంగాణలో సమతామూర్తి విగ్రహావిష్కరణ, అసెంబ్లీ సమావేశాలు, యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం లాంటి ప్రధాన కార్యక్రమాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కాస్త సస్పెన్స్‌గా మారింది.