CM KCR : తగ్గేదేలే.. లిక్కర్ స్కామ్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపుల్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ వేధింపులను లీగల్ గానే ఎదుర్కొందాం అంటూ పార్టీ నేతలకు సూచించారు.(CM KCR)

CM KCR : తగ్గేదేలే.. లిక్కర్ స్కామ్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

CM KCR : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపుల్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ వేధింపులను లీగల్ గానే ఎదుర్కొందాం అంటూ పార్టీ నేతలకు సూచించారు.

తన కుమార్తె కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై కేసీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని మండిపడ్డారు. మంత్రులతో మొదలుపెట్టి, ఇప్పుడు కవిత వరకు వచ్చారని అన్నారు.

ఏం చేస్తారో చేసుకోనివ్వండి. కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం మాత్రం ఆపేది లేదు. బీజేపీని గద్దె దింపే వరకు విశ్రమించొద్దు అని పార్టీ శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు కేసీఆర్. శుక్రవారం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.(CM KCR)

Also Read..Telangana : కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ.. అవి ఈడీ సమన్లు కావు మోదీ సమన్లు : కేటీఆర్

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు వేగం పుంజుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శనివారం విచారించనుంది. ఈ నేపథ్యంలో, కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీ బయల్దేరారు. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కేటీఆర్ ఢిల్లీ పయనమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు, ముఖ్యనేతలు కూడా ఢిల్లీ బయల్దేరారు.

లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 9న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే తనకు ఈ నెల 9, 10వ తేదీల్లో కూడా తీరిక లేదని, 11వ తేదీన విచారణకు వస్తానని కవిత ఈడీకి బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె రేపు (మార్చి 11) ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

Also Read..Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు వ్యతిరేకంగా హైదరాబాదీ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఈడీకి తానిచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో తన లాయర్ ద్వారా పిటిషన్ వేశారు. దీంతో పిళ్లై పిటిషన్ పై స్పందించాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.(CM KCR)

లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన ధర్నా కోసం కవిత కూడా ఢిల్లీలోనే ఉన్నారు. శనివారం ఉదయం ఆమె ఈడీ ఆఫీసులో విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.

Also Read..Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరిపై బిజెపి కన్ను… పట్టు సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీలు… వ్యూహాల్లో నిమగ్నమైన గులాబీ పార్టీ

ఎమ్మెల్సీ కవితకు తానే బినామీనంటూ ఈడీకి వాంగ్మూలం ఇచ్చిన రామచంద్ర పిళ్లై.. ఇప్పుడు మాటమార్చారు. తన వాంగ్మూలాన్ని వాపస్ తీసుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో శనివారం కవిత విచారణ ఏ మలుపు తీసుకోనుందనే తీవ్ర ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది.(CM KCR)

Also Read..CM KCR: ముందస్తు ఎన్నికలు ఉండవు.. త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు