Paddy Issue : ఢిల్లీలో సీఎం కేసీఆర్ మకాం..ధర్నాకు వ్యూహరచన ?

కొనుగోళ్లపై క్లారిటీ వచ్చాకే ఢిల్లీ నుంచి కదులుతామంటున్నారు. మరోవైపు.. మంత్రులు, ప్రజాప్రతినిధులతో ధర్నాకు సైతం వ్యూహరచన చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.

Paddy Issue : ఢిల్లీలో సీఎం కేసీఆర్ మకాం..ధర్నాకు వ్యూహరచన ?

Kcr In Delhi

Telangana CM KCR : ధాన్యం కొనుగోళ్ల అంశంపై.. ఢిల్లీలో మకాం వేశారు సీఎం కేసీఆర్‌, మంత్రులు. తెలంగాణలో పండించే ధాన్యం కొనుగోళ్ల అంశంపై.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి భేటీ కానున్నారు. పీయూష్‌ గోయల్‌తో సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇంకా ఖరారు కాకపోవడంతో.. 2021, నవంబర్ 22వ తేదీ సోమవారం మంత్రులు కేంద్ర మంత్రిని కలవనున్నారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై చర్చించనున్నారు మంత్రులు. గతేడాది రబీలో పెండింగ్‌లో ఉన్న ధాన్యం.. ప్రస్తుత ఖరీప్‌ ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నారు. రబీలో వరి వేస్తే కొనుగోలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత కోరనున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామంటున్న టీఆర్ఎస్‌ వర్గాలు.. కొనుగోళ్లపై క్లారిటీ వచ్చాకే ఢిల్లీ నుంచి కదులుతామంటున్నారు. మరోవైపు.. మంత్రులు, ప్రజాప్రతినిధులతో ధర్నాకు సైతం వ్యూహరచన చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.

Read More : Rayalacheruvu Lake : రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది..చెవిరెడ్డి హెచ్చరికలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులతో  చర్చించనున్నారు. ముఖ్యంగా యాసంగి పంటలను కేంద్రం కొంటుందా కొనదా అన్న విషయంపై క్లారిటీ తీసుకోనున్నారు సీఎం. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నివ్వాలని కోరనున్నారు.  యాసంగిలో వరి పంట వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబితే.. వరిపంటే వేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రైతులకు పిలుపునిచ్చారు. కేంద్రం బాయిల్డ్‌ రైస్ కొనని గతంలో చెప్పింది. దీంతో యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొంటారా కొనరా? కొంటే ఎన్ని క్వింటాళ్లు కొంటారో రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేయనున్నారు కేసీఆర్.

Read More : AP Capital : రాజధాని..కీలక పరిణామం, ఎప్పుడేం జరిగింది ?

అటు కృష్ణాగోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరనున్నారు కేసీఆర్. ట్రైబ్యునల్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.  సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన మంత్రులు, అధికారులు.. ఆయా కేంద్ర శాఖల ఉన్నతాధికారులతో  సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా బీసీ గణన చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్‌ చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణపైనా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు సీఎం కేసీఆర్.