CM KCR : JPSలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పర్మినెంట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్, విధివిధానాలకు ఆదేశం

CM KCR : జేపీఎస్‌ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్దీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.

CM KCR : JPSలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పర్మినెంట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్, విధివిధానాలకు ఆదేశం

CM KCR (Photo : Twitter)

CM KCR – JPS Regularisation : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని రెగ్యులరైజ్(పర్మినెంట్) చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉన్నతాధికారులతో జేపీఎస్ ల క్రమబద్దీకరణ అంశంపై చర్చించిన సీఎం కేసీఆర్.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు:
జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శి లేదా శాఖాధిపతి స్థాయి అధికారి.. జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు. జేపీఎస్ ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్దీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.

Also Read..Revanth Reddy : జంట నగరాలపై అణుబాంబే, హైదరాబాద్‌లో వేలాది మంది చనిపోయే పరిస్థితి వస్తుంది..! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వ హామీతో సమ్మె విరమణ:
అటు తెలంగాణలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రతిపాదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించారు. ఆ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్ ల భర్తీ ప్రక్రియ, క్రమబద్దీకరణ తదుపరి దశలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, జేపీఎస్ లు తమ ప్రొబేషన్ పీరియడ్ పూర్తైన నేపథ్యంలో రెగ్యులరైజ్ చేయాలని కొంతకాలం పాటు సమ్మె చేపట్టారు. అనంతరం ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జేపీఎస్ ల సర్వీస్ ను క్రమబద్దీకరించాలని నిర్ణయించింది.

Also Read..Bandi Sanjay : 111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కామ్, కారు చౌకగా కొట్టేసేందుకు ప్లాన్- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

జేపీఎస్ లను రెగులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కమిటీ నివేదిక రాగానే క్రమబద్దీకరణ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. అటు ప్రభుత్వ నిర్ణయంపై జేపీఎస్ లు హర్షం వ్యక్తం చేశారు.