Telangana CM KCR : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో దేశ రాజకీయాలపై చర్చించా : సీఎం కేసీఆర్

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్ధేశం కావాలన్నారు.

Telangana CM KCR : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో దేశ రాజకీయాలపై చర్చించా : సీఎం కేసీఆర్

Cm Kcr Cm Soren

CM KCR met Hemant Soren : బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వేగంగా పావులు కదుపుతున్నారు. వరుసగా ఆయన పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. గాల్వాన్‌ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు జార్ఖండ్ సీఎంతో కలిసి 10 లక్షల రూపాయల చెక్కులను అందించారు.

పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై హేమంత్ సొరెన్‌తో కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ హేమంత్ సోరెన్ తో దేశ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు శిబు సోరెన్ సహకరించారని గుర్తు చేశారు. త్వరలో అందరం కలుస్తామని చెప్పారు. దేశాభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక కావాలో చర్చిస్తామని తెలిపారు.

CM KCR : రాంచీలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు.. పెరుగుతున్న ప్రజాదరణ

ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకమనేది కాదన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్ధేశం కావాలన్నారు. దేశాభివృద్ధే ముఖ్య లక్ష్యమని తెలిపారు. జార్ఖండ్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి జేఎంఎం జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవలే కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాకరేను సీఎం కేసీఆర్ కలిశారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్..నేతలతో వరుసగా సమావేశమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.

Delhi : ఢిల్లీలో సీఎం కేసీఆర్ ని కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి..అందుకేనా..?

నిన్న ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను పలువురు నేతలు కలిశారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. సీఎం పర్యటిస్తున్న ప్రాంతాల్లో కేసీఆర్‌ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. నిన్న వారణాసిలో, ఇవాళ రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.