Telangana : మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అనుకున్నవి సాధించి తీరుతాం : కేసీఆర్

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు.. మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అనుకున్నవి సాధించి తీరుతామని..అసాధ్యమైనదాన్నిసుసాధ్యం చేస్తామని అన్నారు.

Telangana : మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అనుకున్నవి సాధించి తీరుతాం : కేసీఆర్

Telangana CM KCR

Telangana : మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అనుకున్నవి సాధించి తీరుతామని..అసాధ్యమైనదాన్నిసుసాధ్యం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిందే. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతు..గతంలో తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల సమస్యలపై దృష్టిపెట్టి ఎన్నో సమస్యల్ని పరిష్కరించామన్నారు.

రైతుబంధుతో రైతులకు అండగా నిలబడ్డామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి పంటభూముల్ని పెంచి అన్నదాతలకు అండగా నిలబడ్డామని తెలిపారు. నాకు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని..ఈ సుధీర్ఘకాలంలో ఈ అనుభవంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని..మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అసంభం అనేదే ఉండదని..నిజాయితీగా పనిచేస్తు విజయం సాధిస్తామని అన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో అందరి కడుపులు నింపే రైతులు ఇబ్బందులు పడకూడదని..రైతు సమస్యలను నా సమస్యలుగా భావించి పరిష్కారమార్గాలు చేపట్టామని అన్నారు. ఢిల్లీలో 13నెలల పాటు పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ధర్నాలు చేశారని..ఈ ఆందోళనల్లో 750మంది రైతులు అమరులయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు.