CM KCR : రాష్ట్రంలో 50వేల మంది డాక్టర్ల నియామకాలు, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌకర్యాలపైనా ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్.

CM KCR : రాష్ట్రంలో 50వేల మంది డాక్టర్ల నియామకాలు, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Cm Kcr

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌకర్యాలపైనా ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్.

ప్రగతి భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ కోవిడ్ 19పై సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నియామకాలకు తెరలేపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన అర్హులైన వారి నుంచి వివిధ డిపార్ట్మెంట్‌లలో సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని సూచించారు.

రెండు మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, వారిని సేవలను వినియోగించుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. వరంగల్, ఆదిలాబాద్ రిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తక్షణమే ప్రారంభించి వైద్య సిబ్బందిని నియామించాలని ఆదేశించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో మరో 25 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రిల్లో 7393 బెడ్లు, 2470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని సీఎం కేసీఆర్‌కు అధికారులు తెలిపారు. స్వల్ప కాలానికి నియమించుకున్న వైద్య సిబ్బందికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కష్ట సమయంలో రాష్ట్రం కోసం పని చేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపు ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు కలపాలని సీఎం ఆదేశించారు.