KCR : 17న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

పలు జిల్లాల్లో ప్రగతి పనుల ప్రారంభంపై కేసీఆర్ దృష్టిపెట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ ఆఫీస్ లు, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

KCR : 17న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

Cm Kcr

KCR : తమిళనాడు పర్యటన ముగించుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వరుస కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు.. అటు పార్టీ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈనెల 17 శుక్రవారం రోజున హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరగనున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు.

కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్ పర్సన్లు హాజరుకానున్నారు. పార్టీ పటిష్టత.. తాజా రాజకీయ పరిణామాలు.. కేంద్రం-రాష్ట్రం హక్కులు.. అనుసరించాల్సిన వైఖరిపైనా కేసీఆర్ ఈ మీటింగ్ లో మాట్లాడనున్నట్టు సమాచారం.

మరోవైపు.. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈనెల 19న వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఆ తర్వాత వరంగల్, నల్గొండ జిల్లాలకు వెళ్తారు కేసీఆర్. జగిత్యాల, జనగామకు కూడా వెళ్లే సూచనలు ఉన్నాయి.

Read Also : YSRCP MP’s Press Meet : ఏపీని కాదని పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు-వైసీపీ ఎంపీల సూటి ప్రశ్న

పలు జిల్లాల్లో ప్రగతి పనుల ప్రారంభంపై కేసీఆర్ దృష్టిపెట్టారు. ఇప్పటికే జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ ఆఫీస్ లు, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ జిల్లాల్లో సీఎం ముందుగా పర్యటించనున్నారు. పార్టీ పటిష్టతపైనా లీడర్లతో చర్చించనున్నారు.

కరోనా సమయంలో పలు జిల్లాల్లో వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. సీటీ స్కాన్ మెషినరీతోపాటు.. డయాలసిస్ ఎక్విప్ మెంట్ ను అందుబాటులోకి తెచ్చింది. పట్టణాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లను సీఎం విజిట్ చేసి సౌకర్యాలు పరిశీలించే చాన్సుంది. కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో వసతులపై రివ్యూ చేయనున్నారు కేసీఆర్.

Read Also : AP High Court : తిరుపతిలో అమరావతి రైతుల సభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్