CM KCR : మనీశ్ సిసోడియా అరెస్ట్‌, నెక్ట్స్ ఎవరు?-సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న అనుబంధంపై చర్చ జరక్కుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని కేసీఆర్ అన్నారు.

CM KCR : మనీశ్ సిసోడియా అరెస్ట్‌, నెక్ట్స్ ఎవరు?-సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్

CM KCR : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న అనుబంధంపై చర్చ జరక్కుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని కేసీఆర్ అన్నారు. మనీశ్ సిసోడియా అరెస్ట్ పై స్పందించిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కేసీఆర్ హెచ్చరించారు.

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయనను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది. దాంతో, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను సీబీఐ మరోసారి ప్రశ్నించనుంది.

Also Read..Vivek Venkataswamy: మనీష్ సిసోడియా తరహాలోనే త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు: మాజీ ఎంపీ వివేక్

న్యాయస్థానంలో సిసోడియా తరఫు న్యాయవాది దయన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసిందన్నారు. సీబీఐ పలుమార్లు చేసిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సిసోడియా అరెస్ట్ జరిగిందన్నారు. సిసోడియాను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఇదే కేసులో విజయ్ నాయర్ ఇప్పటికే బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Also Read..Manish Sisodia: సీబీఐ కస్టడీకి మనీష్ సిసోడియా.. ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

మనీశ్ సిసోడియా అరెస్ట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపింది. విపక్షాలు కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో కవిత రూ.150 కోట్లు ఆప్ ప్రభుత్వానికి ఇచ్చారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కేంద్రం మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

Also Read..Delhi Liquor Scam: మనీశ్ సిసోడియా అరెస్ట్ మీద సీబీఐ అధికారులే వ్యతిరేకంగా ఉన్నారట