Warangal : థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటాం, కరోనాపై భయం వద్దు – కేసీఆర్

Warangal : థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటాం, కరోనాపై భయం వద్దు – కేసీఆర్

Cm Kcr Warangal

Telangana CM KCR : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటామని, ఈ వైరస్ పై ఎలాంటి భయబ్రాంతులకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్, ఫంగస్ లపై తప్పుడు ప్రచారం  చేయవద్దని సూచించారు. తనకు కరోనా వచ్చినా పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నట్లు, ప్రజల్లో లేనిపోని ఆందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు.

2021, జూన్ 21వ తేదీ సోమవారం సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. 6.73 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ భవనాన్ని నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు సేవ చేస్తున్నారని వారిని ఆయన ప్రశంసించారు. వైద్యులపై దాడులు 20చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేశారని, బాధితులకు కిట్లు, మందులు అందించారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కరోనా కేసులు లేవని వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న MGM ఆసుపత్రిని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తామన్నారు. జూలై 01 నుంచి జూలై 10 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.