CM KCR : నాలుగో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు నాలుగో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు సమస్యలు, రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు.

CM KCR : నాలుగో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు

Kcr

CM KCR waiting for PM Modi’s appointment : తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు నాలుగో రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు సమస్యలు, రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మ‌కాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర పెండింగ్ స‌మ‌స్యల‌తో పాటు.. ట్రైబ్యునల్‌ అంశంలో సీరియ‌స్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టుల‌పై కేంద్రం పెత్తనం ఏంటీ అంటున్నారు. స‌హ‌నాన్ని పరీక్షించ‌వ‌ద్దు అంటూ కేంద్రానికి వార్నింగ్ కూడా ఇచ్చారు.

కేంద్ర జ‌లవ‌న‌రుల శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ను క‌లిసి.. ట్రైబ్యున‌ల్ ఏర్పాటుపై వెంట‌నే నిర్ణయం తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ కోర‌నున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో కూడా దీనిపై చ‌ర్చించ‌నున్నారు. నీటి వాటాలు తేల్చకుండా నీళ్ళ పంచాయ‌తీ ఎలా ప‌రిష్కారం అవుతుంద‌ని.. దీని కోసం ట్రైబ్యునల్ ఏర్పాటే స‌రైన మార్గమని తెలంగాణ స‌ర్కార్ అంటోంది. కొత్త ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లుగా కోరుతున్నప్పటికి… కేంద్రం మాత్రం ఎలాంటి ముందడుగు వేయడం లేదు. దీంతో ఆఖరిగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రయత్నం చేయనున్నారు.

Rain Forecast : బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

నిన్నటి మంత్రుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. నిన్న ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ ను తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం కలిశారు. అయితే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో జరిగిన సమావేశంలో హామీ లభించ లేదు. ఏడాదికి ఒకేసారి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం నిర్దేశించాలని టీఆర్ఎస్ నేతల బృందం కేంద్రమంత్రిని కోరింది.

రెండు సీజన్లలో కలిపి తెలంగాణ నుంచి సుమారు 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని టిఆర్ఎస్ నేతల బృందం కోరారు. ఏ సీజన్ లో ఎంత ధాన్యం ఉంటుందో చెప్పాలని కేంద్రం కోరింది. రెండు సీజన్లలో ఉత్పత్తిపై స్పష్టంగా చెప్పాలని కేంద్రమంత్రులు
అన్నారు. రెండు రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఎల్లుండి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దామని పీయూష్ గోయల్ తెలిపారు.