CM KCR : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయన్నారు.

CM KCR : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

Kcr

CM KCR letter to PM Modi : ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు.

ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయన్నారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్ప రైతులకు వచ్చిన ఆదాయమేమీ లేదని పేర్కొన్నారు.

Muralidhara Rao : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం ఘటన కుట్రే : మురళీధరరావు

ఎన్ఆర్జీఈని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలిపారు. ఎరువులపై సబ్సిడీ కొనసాగించాలని కోరారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి రాసిన లేఖలో  సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.