Telangana Congress Crisis : కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.. హస్తానికి హ్యాండ్ ఇస్తున్న నాయకులు

త్వరలో బలపడతాం, అధికారాన్ని చేపడతాం అని చెబుతున్న కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బలపడటం సంగతి పక్కన పెడితే నేతల వలసలు పార్టీని కలవరపెడుతున్నాయి.

Telangana Congress Crisis : కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.. హస్తానికి హ్యాండ్ ఇస్తున్న నాయకులు

Telangana Congress Crisis : త్వరలో బలపడతాం, అధికారాన్ని చేపడతాం అని చెబుతున్న కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బలపడటం సంగతి పక్కన పెడితే నేతల వలసలు పార్టీని కలవరపెడుతున్నాయి. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. ఆ కల్లోలం నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోక ముందే మరో సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. ఖైరతాబాద్ పరిణామాలపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఆయన ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు తనకు తెలియకుండానే విజయారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆయన చాలాకాలంగా రగిలిపోతున్నారు.

Komati Reddy Brothers in Delhi : ఢిల్లీలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు..అమిత్ షాతో భేటీ

ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ కూడా కాంగ్రెస్ లో కల్లోలం రగిలిస్తోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే, ఆ సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి రగిలిపోతున్నారు. బ్రాండ్ పై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. అయినా, రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై వెంకట్ రెడ్డి రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డి ముఖం చూసేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వెంకట్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మునుగోడు పరిణామాల సమయంలో వీరిద్దరి భేటీ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నిన్న తమ్ముడు.. ఇవాళ అన్నయ్య.. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో కల్లోలం రేపుతున్నారు. అన్నదమ్ముల దెబ్బతో హస్తం పార్టీ షేక్ అవుతోంది. రాష్ట్ర నాయకత్వం మొదలు అధిష్టానం పెద్దలను రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో పెను దుమారమే రేపింది. ఇప్పుడు ఆయన అన్న కోమటరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో మరోసారి ప్రకంపనలు రేపుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ దేశ రాజధానిలో ఎవరికి తోచిన రాజకీయం వారు చేసేస్తున్నారు.

MP Komatireddy Venkat Reddy : ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటా : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు బహిరంగంగానే సన్నాహాలు చేసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి బీజేపీలో చేరిక ముహూర్తానికి సంబంధించి చర్చించనున్నారు.