TPCC : హస్తినకు పోయి రావలె..ఢిల్లీకి టి. కాంగ్రెస్ ముఖ్యనేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. ఏఐసీసీ పిలుపుమేరకు.. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది.

TPCC : హస్తినకు పోయి రావలె..ఢిల్లీకి టి. కాంగ్రెస్ ముఖ్యనేతలు

T.congress

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. ఏఐసీసీ పిలుపుమేరకు.. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌ ఫలితంపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేసిన అధిష్టానం…  ఘోర ఓటమిపై నేతలతో చర్చించనుంది. 2018 ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఉపఎన్నికలో 3 వేల ఓట్లకే పరిమితం కావడంపై సమీక్షించనున్నారు. కేవలం 1.46 శాతం ఓట్లకు పరిమితం కావడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉంది. దీంతో ఇవాళ ఢిల్లీకి రావాల్సిందిగా 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది.

Read More : Hyd Metro : మెట్రోస్టేషన్‌పై నుంచి దూకిన యువతి పరిస్థితి విషమం, తనంటతానే దూకిందా ?

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు .. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌తో సహా ఎన్నికల్లో భాగస్వాయ్యం అయిన నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా సూచించింది. అయితే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మొదట్లో పిలుపు అందినా తర్వాత నిలిపేశారు. మహేశ్వర్ రెడ్డి ప్లేస్‌లో ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారంతా హస్తిన టూర్‌కు రెడీ అయ్యారు.

Read More : TSRTC : ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లకు హెచ్చరికలు, భారీ జరిమాన..ఒప్పందం రద్దు!

హుజురాబాద్ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గట్టిగా ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసం రేవంత్ పనిచేశారని వారు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కనీసం సహకరించలేదని రేవంత్ వర్గం గుర్తు చేస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదని.. కేసీఆర్, ఈటల మధ్య జరిగిందని రేవంత్ వర్గం హైకమాండ్‌కు నచ్చచెప్పే పనిలో ఉంది.