T Congress: రాహుల్‌తో ముగిసిన టీ కాంగ్రెస్ లీడర్ల భేటీ.. ఏప్రిల్ 4న మళ్లీ సమావేశం..!

తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ సహా.. కీలక నేతలు భేటీలో పాల్గొన్నారు. అరగంటకు పైగా సమావేశం జరిగింది. ఏప్రిల్ 4న మళ్లీ భేటీ కానున్నారు.

T Congress: రాహుల్‌తో ముగిసిన టీ కాంగ్రెస్ లీడర్ల భేటీ.. ఏప్రిల్ 4న మళ్లీ సమావేశం..!

T Cong

T Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ సహా.. కీలక నేతలు భేటీలో పాల్గొన్నారు. అరగంటకు పైగా సమావేశం జరిగింది. ఏప్రిల్ 4న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అదే రోజున.. రాహుల్ తెలంగాణ పర్యటన ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చెప్పారు.

“ఏప్రిల్ 4న మరోసారి.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ ను కలుస్తాం. 22 మంది నేతలు పాల్గొనే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత అంశాలు, బలోపేతం, అంతర్గత సమస్యలపై సీనియర్లతో రాహుల్ చర్చించనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు.. డిసెంబర్ 9 నుంచి మార్చి 30 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తాం. ఒక్కో కార్యకర్తకు 2 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ఈ మేరకు.. న్యూ ఇండియా అష్యూరెన్స్ సంస్థకు.. 6 కోట్ల 34 లక్షల రూపాయల చెక్కును రాహుల్ గాంధీ అందజేశారు” అని టీ కాంగ్రెస్ నేతలు.. భేటీ అనంతరం తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపైనా సీనియర్లు మాట్లాడారు. నల్గొండ జిల్లా సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో ఉందని.. పెద్దపల్లి జిల్లా రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. పార్టీలో సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మరోవైపు.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టాలని రాహుల్ తమను ఆదేశించారన్నారు. ఏప్రిల్ 1 నుంచి.. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిందిగా రాహుల్ ను ఆహ్వానించామన్నారు.

Read More: Congress: ఢిల్లీ నుండి కొందరికే ఫోన్ .. వీహెచ్ ,జగ్గారెడ్డిలకు షాక్