Telangana: హ‌నుమ‌కొండ‌లో నిరసనల‌ పేరుతో కాంగ్రెస్ దాడులకు తెగబడింది: ఎంపీ ఓం ప్రకాశ్

హ‌నుమ‌కొండ‌లో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత ఓం ప్రకాశ్ మాథూర్ మండిపడ్డారు. హ‌నుమ‌కొండ‌లో కాంగ్రెస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

Telangana: హ‌నుమ‌కొండ‌లో నిరసనల‌ పేరుతో కాంగ్రెస్ దాడులకు తెగబడింది: ఎంపీ ఓం ప్రకాశ్
ad

Telangana: హ‌నుమ‌కొండ‌లో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత ఓం ప్రకాశ్ మాథూర్ మండిపడ్డారు. హ‌నుమ‌కొండ‌లో కాంగ్రెస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నిర‌స‌న‌కు దిగ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీనిపై ఓం ప్ర‌కాశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలను కలవడానికి తాము వచ్చామ‌ని అన్నారు. తాను నిన్నటి నుండి బీజేపీ శ్రేణులను కలుస్తున్నానని తెలిపారు.

Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

బీజేపీ సమావేశాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారని చెప్పారు. తాను ఎన్నో రాష్ట్రాలు తిరిగానని, ఇలాంటి నిర్బంధం ఎక్కడా చూడలేదని అన్నారు. పోలీసులు త‌మ‌ శాంతియుత సమావేశాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని ఆయ‌న అన్నారు. నిరసనల‌ పేరుతో కాంగ్రెస్ శ్రేణులు దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.