TS Covid : తెలంగాణలో ఒక్కరోజే 2 వేల 707 కేసులు..హైదరాబాద్‌‌లో ఎంతంటే

గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే...ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా..

10TV Telugu News

Telangana Corona New Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనా గుబులు పుట్టిస్తోంది. రోజురోజుకు కేసులు అధికమౌతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పండుగ కాలం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కోవిడ్ ని బంధనలు తు.చ తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు. గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,78,290గా ఉందని పేర్కొంది.

Read More : Jason Momoa : 16ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పేసిన ఆక్వామ్యాన్ స్టార్ జాసన్ దంపతులు

జిల్లాల వారిగా కేసులు : –

ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 40, జీహెచ్ఎంసీ 1328, జగిత్యాల 19, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 06, జోగులాంబ గద్వాల 07, కామారెడ్డి 14, కరీంనగర్ 38, ఖమ్మం 56, కొమురం భీమ్, ఆసిఫాబాద్ 14, మహబూబ్ నగర్ 35, మహబూబాబాద్ 44, మంచిర్యాల 58, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్ గిరి 248, ములుగు 08, నాగర్ కర్నూలు 22, నల్గొండ 29, నారాయణపేట 14, నిర్మల్ 13, నిజామాబాద్ 60, పెద్దపల్లి 52, రాజన్న సిరిసిల్ల 13, రంగారెడ్డి 202, సంగారెడ్డి 78, సిద్ధిపేట 36, సూర్యాపేట 38, వికారాబాద్ 36, వనపర్తి 15, వరంగల్ రూరల్ 17, హన్మకొండ 75, యాదాద్రి భువనగిరి 37.

×