Telangana Corona News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 067 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 29వేల 840 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,116కి తగ్గింది.

Telangana Corona News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

Telangana Corona News : తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 8వేల 456 మందికి కరోనా పరీక్షలు చేయగా, 102 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 60 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 కేసులు, మహబూబాబాద్ జిల్లాలో 5 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 067 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 29వేల 840 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,116కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్..