Telangana Corona : సాయంత్రం 6.30 గంటల వరకే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలు

ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని దుకాణ యజమానులకు సూచించింది.

Telangana Corona : సాయంత్రం 6.30 గంటల వరకే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలు

Automobile Shops

 Automobile Spare Parts Stores : తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మూడు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వైరస్ కు చెక్ పెట్టడానికి పలు గ్రామాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగం బజార్ లో కొందరు వ్యాపారస్తులకు కరోనా సోకడంతో దుకాణం తెరిచే సమయంలో మార్పులు చేశారు. తాజాగా..ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని దుకాణ యజమానులకు సూచించింది.

రాష్ట్రంలో అన్ని ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌(టూ, త్రీ వీలర్‌) దుకాణాలు సాయంత్రం గం.6:30లకే మూసివేయాలని అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా వెల్లడించారు. ఈ నిబంధనలు 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నుంచి ల్లోకి వస్తాయని, దుకాణ యజమానులు అందరూ తప్పకుండా పాటించాలని సూచించారు.

తెలంగాణలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3 వేలకు చేరువలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.. 24 గంటల్లో 2 వేల 909 మంది వైరస్ బారిన పడ్డారు. వరుసగా రెండోరోజు కూడా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య… లక్ష దాటింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో… పూర్తి స్థాయిలో కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకునే అంశంపై మంత్రి ఈటల కాలేజీ యాజమాన్యాలతో సమావేశమయ్యారు. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో.. 50 శాతం బెడ్లు ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు.
Read More : Myanmar troops : మయన్మార్‌లో మారణ హోమం.. 80మందికి పైగా పౌరులు మృతి