Telangana : తెలంగాణలో అదుపులోకి వచ్చిన కరోనా

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చింది. కేసులు 300లకు దిగువనే నమోదవుతున్నాయి.

Telangana : తెలంగాణలో అదుపులోకి వచ్చిన కరోనా

Corona (4)

Telangana : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కేసుల సంఖ్య అదుపులోకి రావడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 208 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,95,780కి చేరింది.

Read More : Congress : కాంగ్రెస్ లోకి జిగ్నేష్ మేవానీ.. కన్నయ్య కుమార్

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More : Home delivery: మద్యం హోం డెలివరీ.. తెలంగాణ ప్రజల అభిప్రాయం ఇదే.. 100శాతం హైదరాబాదీల సపోర్ట్!