Telangana Covid News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 747 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 703 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 933కి తగ్గింది.

Telangana Covid News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే

Telangana Covid News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 11వేల 398 మందికి కరోనా పరీక్షలు చేయగా, 128 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 54 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 కేసులు, కరీంనగర్ జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 177 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసులకంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 747 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 703 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 933కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 11వేల 127 మందికి కరోనా పరీక్షలు చేయగా, 130 మందికి పాజిటివ్ గా తేలింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్..