Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల

తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 300ల లోపే కేసులు వచ్చాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల

COVID19 cases in India

Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 300ల లోపే కేసులు వచ్చాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 18వేల 791 మందికి కరోనా పరీక్షలు చేయగా, 291 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 396 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 446కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 28వేల 899 మందికి కరోనా పరీక్షలు చేయగా, 440 మందికి పాజిటివ్ గా తేలింది.