Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల.. రికవరీలే ఎక్కువ

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 25వేల 756 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 15వేల 735 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 910కి తగ్గింది.

Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల.. రికవరీలే ఎక్కువ

Telangana Covid

Telangana Corona News : తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24వేల 938 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 396 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 193 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 23 కేసులు, కరీంనగర్ జిల్లాలో 19 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14 కేసులు గుర్తించారు.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 705 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువ. ఇక రిలీఫ్ ఇచ్చే మరో అంశం కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 25వేల 756 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 15వేల 735 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 910కి తగ్గింది. క్రితం రోజు ఆ సంఖ్య 6వేల 219. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 40వేల 451 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 652 మందికి పాజిటివ్ గా తేలింది.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్..