Telangana Covid Numbers : తెలంగాణలో కొత్తగా 75 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 23వేల 861 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 75 కేసులు వచ్చాయి.(Telangana Covid Numbers)

Telangana Covid Numbers : తెలంగాణలో కొత్తగా 75 కరోనా కేసులు

Telangana Covid Report

Telangana Covid Numbers : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 23వేల 861 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 75మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మొత్తం కేసుల్లో సగం హైదరాబాద్ లోనే వెలుగుచూశాయి. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 34 మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో మరో 82 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 99.37 శాతానికి పెరిగింది. ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 816 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. (Telangana Covid Numbers)

ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,574 పాజిటివ్ కేసులు నమోదవగా.. 7,85,647 మంది కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,39,24,854 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 24వేల 848 కోవిడ్ టెస్టులు నిర్వహించగా, 81 కరోనా కేసులు వచ్చాయి.(Telangana Covid Numbers)

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసులు వరుసగా మూడోరోజు 3 వేలకు దిగువనే నమోదయ్యాయి. మంగళవారం 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2వేల 876 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో మహమ్మారి వ్యాప్తి రెండేళ్ల కనిష్ఠానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో మరో 98 మంది కోవిడ్ తో మృతి చెందారు. ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

రోజురోజుకూ యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 32,811(0.08 శాతం)గా ఉంది. నిన్న 3,884 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 4.24 కోట్లు(98.82 శాతం) దాటాయి.

Coronavirus India : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2 వేల 876 కేసులు

మరోవైపు కరోనా టీకా కార్యక్రమం దశలవారీగా కొనసాగుతోంది. బుధవారం నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ ప్రారంభమైంది. బయోలాజికల్ ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వేస్తున్నారు. ఈ దశలో సుమారు 7.11 కోట్ల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నట్లు కేంద్రం అంచనా వేసింది. అలాగే 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ కేంద్రం 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసింది. నిన్న 18.9 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

భారత్‌లో ఇప్పటివరకూ 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ అవగా.. అందులో 15 నుంచి 17 వయస్సు వారికి 9 కోట్లకు పైగా డోసులు, రెండు కోట్లకు పైగా ప్రికాషనరీ డోసులు ఇచ్చారు. 12-14 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో.. భారత టీకా కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల సహకారంతోనే గత ఏడాది ప్రారంభం నుంచి ఈ టీకా కార్యక్రమం సజావుగా సాగుతోందన్నారు. ఇతర దేశాల్లో టీకా పట్ల అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. మన దగ్గర ప్రజలు టీకా తీసుకోవడమే కాకుండా, ఇతరులు టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారని, ఈ తీరు చూడటానికి చాలా బాగుందని ప్రధాని అన్నారు.