TS Covid-19 Updates: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. పాజిటివిటి రేటు అంతే..

తెలంగాణలో కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు..

TS Covid-19 Updates: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. పాజిటివిటి రేటు అంతే..

Telangana Covid Updates : తెలంగాణలో కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. కొత్తగా 2,175 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ బారినపడి మరో 15 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 3,821 మంది కొవిడ్‌ నుంచి రికవరీ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 253 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారంతో పోలిస్తే.. సుమారు వంద కేసులు తగ్గాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 2 శాతానికి పడిపోయిందని పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 253 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఖమ్మంలో 144, భద్రాద్రి జిల్లాలో 110 , కరీంనగర్ లో 113 కేసులు, నల్గొండలో 178 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 55వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంటాయి. అందులో 14వేలకు పైగా పడకలు ఖాళీగానే ఉన్నాయి.

7వేల బెడ్స్ ఐసీయూలో కూడా ఖాలీలు ఉన్నట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద గత రెండు రోజులుగా 2 శాతం కంటే తక్కువగా కరోనా పాజిటీవ్ రేటు నమోదవుతోంది.