Telangana : రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు – సీఎం కేసీఆర్

దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పేద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని.. దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం.. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

Telangana : రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు – సీఎం కేసీఆర్

Kcr

Telangana Dalit Bandhu : దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పేద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని.. దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం.. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. దళితబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందని.. అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకం అమలు చేస్తామని చెప్పారాయన.

Read More : Viagra Cream : ఈ వయాగ్రా క్రీమ్.. మహిళల్లో లైంగిక ఆనందాన్ని రెట్టింపు చేస్తుందట!

దళితబంధు పథకం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని.. పట్టుదలతో పథకం విజయవంతానికి కృషి చేద్దామని దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు, సంఘాలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సులో చ‌ర్చించ‌నున్నారు. ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, ప్రతీ మున్సిపాలిటీ నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు హాజ‌రుకానున్నారు.