Dalitha Bandhu : ఆగష్టు 16 నుంచి దళితబంధు.. రూ.10లక్షలు సాయం

దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకం దళితబంధు. ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా దళితబంధు స్కీమ్ ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప‌థ‌కంలో భాగంగా

10TV Telugu News

Dalitha Bandhu : దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకం తెలంగాణ దళితబంధు. ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా దళితబంధు స్కీమ్ ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప‌థ‌కంలో భాగంగా ఒక యూనిట్ పెట్టుకోవడానికి ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల సాయం అంద‌జేయ‌నుంది. కేబినెట్ సమావేశంలో దళితబంధు పథకం అమలు, విదివిధానాలపై సీఎం కెసీఆర్ చర్చించారు. ద‌ళిత‌బంధుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టం తేవాల‌ని కేబినెట్ అభిప్రాయపడింది.

దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో, ఆర్ధిక స్థితిలో మెరుగుదల రాదని అన్నారు. లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని దళితబందు పథకం ద్వారా కల్పించనున్నట్లు వెల్లడించారు.

దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న దళితబంధు పథకాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అమలుచేయాలని సీఎం కోరారు. గతంలో ఎస్సీ ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్ లో దళితులకు కేటాయించిన నిధుల్లో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, అదే విధంగా దళితబంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

”దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పరిశ్రమల కేంద్రం (సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌) ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. రైతుబీమా మాదిరే నేత, గీత కార్మికులకు బీమా కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ”దళితులు రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో 20% జనాభా ఉన్నా వారి చేతుల్లో ఉన్న సాగుభూమి 13 లక్షల ఎకరాలే. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు.

అరకొర సాయంతో వారి అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే యూనిట్‌ పెట్టుకోవడానికి రూ. పదిలక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయించాం. బ్యాంకులతో అనుసంధానం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా చేస్తేనే వారి పరిస్థితి మెరుగుపడుతుంది. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లబ్ధిదారులదే. అధికారులు, దళితబంధు స్వచ్ఛంద కార్యకర్తలూ వారికి మార్గదర్శనం చేస్తారు. శిక్షణ, పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటవుతాయి. జిల్లా కలెక్టర్‌, జిల్లా మంత్రి ఇందులో కీలక పాత్ర పోషిస్తారు. దళితవాడల్లో వెంటనే సదుపాయాల కల్పన జరగాలి” అని సీఎం కేసీఆర్ అన్నారు.

10TV Telugu News