Telangana Lockdown : వారిని అడ్డుకోవద్దు.. లాక్‌డౌన్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ డీజీపీ

తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Telangana Lockdown : వారిని అడ్డుకోవద్దు.. లాక్‌డౌన్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ డీజీపీ

Telangana Lockdown

Telangana Lockdown New Guidelines : తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు.

కాగా, లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసుల వైఖరిలో శనివారానికి, ఆదివారానికి స్పష్టమైన తేడా కనిపించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి వాహనాలను అక్కడే అడ్డుకున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ సిబ్బందితోపాటు ఈ-కామర్స్‌ సంస్థ సిబ్బందినీ నిలిపివేశారు. ఈ క్రమంలో ఫుడ్‌ డెలివరీ నిలిపివేసేందుకు ఆయా సంస్థలు మొగ్గు చూపాయి. అలాగే విద్యుత్, వైద్యం వంటి ప్రభుత్వ విభాగాల్లో అత్యవసర సేవల సిబ్బందికీ మినహాయింపు ఇవ్వలేదు.

ఈ పద్ధతుల పట్ల పలు చోట్ల నిరసనలు వ్యక్తం కావడంతో ఆదివారం పోలీసులు కొంత వెనక్కి తగ్గారు. ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ సంస్థల సిబ్బందికి మినహాయింపు కల్పించారు. ప్రభుత్వ విభాగాల్లోని అత్యవసర సేవల సిబ్బందికీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆదివారం(మే 23,2021) నగరంలోని ముగ్గురు పోలీస్‌ కమిషనర్లతో డీజీపీ సమీక్ష జరిపారు. కఠిన లాక్‌డౌన్‌ అమలుకు తాజా మార్గదర్శకాలను జారీ చేశారు.

* లాక్‌డౌన్‌ సమయాన ఆటోలో, కారులో, బైక్ పై వెళ్లే వారు అందుకు గల కారణాలను పోలీసులకు చెప్పాలి.
* తగిన సాక్ష్యాలను చూపాలి. లేదంటే జరిమానా విధించి వెనక్కు పంపుతారు.
* ఉదాహరణకు వైద్యం కోసం వెళ్లేవారి వద్ద డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉండాలి.
* అనారోగ్యంతో బాధపడేవారు, వారి సహాయకులు ఇటీవలి మెడికల్‌ డాక్యుమెంట్లు చూపాలి.
* వైద్యులను తనిఖీలు లేకుండా పంపండి
* అత్యవసర సేవలు అందించేవారిని ఎలాంటి తనిఖీలు లేకుండా పంపించాలని డీజీపీ సూచించారు.
* వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, స్వీపర్లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆసుపత్రి సూపర్‌వైజర్లు, మేనేజర్లు, ఆక్సిజన్‌ టెక్నీషియన్లు, మెడికల్‌ దుకాణాల సిబ్బంది ఇందులో ఉన్నారు. ప్రైవేటు ల్యాబ్‌ టెక్నీషియన్లు, నమూనాలు సేకరించేవారిని ఐడీ కార్డులు క్షుణ్నంగా తనిఖీ చేశాకే వదలాలి.
* ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్సీ ప్లేట్‌ వాహనంలో వెళ్లే ఎయిర్‌పోర్టులో పని చేసే ఉద్యోగులు, పైలట్లు ఇతరులను అనుమతించాలి.
* నిర్మాణ రంగంలో పని చేసే ఉద్యోగులు, కూలీలు, ఇతరులు పనులు ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యే సమయంలో వెసులుబాటు కల్పించాలి.

రాష్ట్రంలో కొంతమేర లాక్‌డౌన్‌ ఆంక్షల్ని సడలించిన పోలీసులు సరిహద్దుల్లో మాత్రం కఠినం చేశారు. శనివారం(మే 22,2021) వరకు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య ఈ-పాస్‌లు లేకున్నా వాహనదారులను అనుమతించగా ఆదివారం(మే 23,2021) నుంచి కట్టడి చేశారు. దీంతో సరిహద్దు వరకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉన్న ఆ సమయంలో చెక్‌పోస్ట్‌ల దగ్గర వాహనాలను తనిఖీ చేశారు. ఈ-పాస్‌లు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను అనుమతించకుండా వెనక్కి పంపేశారు.

అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాల్ని మాత్రమే అనుమతించారు. వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. ముఖ్యంగా ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలు పెరిగాయి. కృష్ణా జిల్లా గరికపాడు దగ్గర కూడా వందల సంఖ్యలో వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్‌పోస్టుల్ని ఆదివారం నుంచి మూసేశారు. కోదాడ చెక్‌పోస్ట్‌ ద్వారా మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు పోలీసులు.