డిజిటల్ క్లాసులు..మూడు గంటలే పాఠాలు

  • Published By: madhu ,Published On : August 26, 2020 / 06:59 AM IST
డిజిటల్ క్లాసులు..మూడు గంటలే పాఠాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ విధానంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్ లైన్ విధానంలో పాఠాలు బోధించనున్న సంగతి తెలిసిందే.




ఇప్పటికే కొన్ని ప్రైవేటు పాఠశాలలో ఈ విధానం ద్వారా…విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రగ్యాత పేరిట జారీ చేసిన మార్గదర్శకాలను ఎస్సీఈఆర్టీ వెబ్ సెట్ లో అందుబాటులో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవ సేన వెల్లడించారు.

https://10tv.in/telangana-man-tested-covid-postive-second-time/

  • కిండర్‌గార్డెన్‌, నర్సరీ, ప్లేస్కూల్‌, ప్రీస్కూల్‌ విద్యార్థులకు గరిష్ఠంగా రోజూ 45 నిమిషాలకు మించకుండా వారానికి మూడ్రోజులు మాత్రమే బోధన జరుగాలి. పెద్దలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో జరగాలి.
  • ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోజూ రెండు తరగతుల చొప్పున వారంలో ఐదు క్లాసులు.
  • 6 నుంచి 8వ తరగతుల వారికి రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మించకుండా మూడు సెషన్లలో క్లాసులు తీసుకోవాలి. రెండు గంటలే బోధన.


  • 9-12వ తరగతి వరకు ఒక్కో క్లాసు 30-45 నిమిషాలకు మించకుండా.. నాలుగు సెషన్లలో పాఠాలు. మొత్తంగా రోజుకు 3 గంటలు మించకూడదు.
  • గురువారం నుంచి టీచర్లు, సిబ్బంది కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ విధులకు హాజరు కావాలి. 1. టీసాట్‌/దూరదర్శన్‌ చానెల్‌. 2.స్మార్ట్‌ఫోన్‌, మొబైల్‌/ ల్యాప్‌టాప్స్‌/ కంప్యూటర్లు ఇంటర్నెట్‌తో ఉండాలి.
  • 3. విద్యార్థులకు టీసాట్‌/దూరదర్శన్‌, స్మార్ట్‌ఫోన్లు/మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ లేని వారిని వేర్వేరుగా గుర్తించాలి. విద్యార్థులకు టీవీ అందుబాటులో లేకపోతే ప్రధానోపాధ్యాయులు గ్రామ పంచాయతీ, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి డిజిటల్‌ పాఠాల కోసం సహకారం పొందాలి. టీవీలు అందుబాటులో ఉన్న విద్యార్థులతో టీవీలు లేని వారిని జత చేయాలి.