Telangana DSP Jobs : డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త

డీఎస్పీ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డీఎస్పీ ఉద్యోగ అభ్య‌ర్థుల ఎత్తును..(Telangana DSP Jobs)

Telangana DSP Jobs : డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త

Telangana Dsp Jobs

Telangana DSP Jobs : డీఎస్పీ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్న డీఎస్పీ ఉద్యోగ అభ్య‌ర్థుల ఎత్తును 167 సెంటీ మీట‌ర్ల నుంచి 165 సెంటీ మీట‌ర్ల‌కు త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శుక్రవారం తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కాగా, డీఎస్పీ అభ్యర్థుల ఎత్తు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. యూపీఎస్సీ నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో కూడా ఐపీఎస్ అభ్య‌ర్థుల ఎత్తు 165 సెంటీ మీట‌ర్లే ఉన్న‌ప్పుడు తెలంగాణ మాత్రం డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తు 167 సెంటీమీట‌ర్లు ఎందుకంటూ మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తును 165 సెంటీమీట‌ర్ల‌కు త‌గ్గించి నిరుద్యోగులకు ఊరట ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.(Telangana DSP Jobs)

Telangana Police Recruitment : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఆ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

అటు, పోలీస్‌ ఉద్యోగాల అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీస్ ఉద్యోగాల (కానిస్టేబుల్, ఎస్ఐ) దరఖాస్తు గడువును పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ (మే 20) రాత్రి 10 గంటలతో గడువు ముగుస్తుంది. అయితే, ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గత 2 రోజుల నుంచి పోలీస్ రిక్రూట్ మెంట్ వెబ్ సైట్(TSLPRB) పని చేయడం లేదని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దరఖాస్తు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించినట్లు అయ్యింది.

మరోవైపు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు సంబంధించి.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ(మొత్తం ఐదేళ్లు) సీఎం కేసీఆర్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థుల విన్నపాలను ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించి, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం మూడేళ్లు పెంచిన సంగతి తెలిసిందే.

Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్.. ఆందోళనలో అభ్యర్థులు

పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు, రవాణ శాఖల్లో కలిపి 17వేల 291 యూనిఫాం ఉద్యో‌గాల భర్తీకి ఈ నెల 2 నుంచి దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారం‌భమైన విషయం తెలి‌సిందే. అన్ని విభా‌గా‌లకు కలిపి గురు‌వారం వరకు 5.2 లక్షల మంది అభ్య‌ర్థుల నుంచి 9.33 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చి‌నట్టు అధికారులు తెలిపారు. వీటిలో మహిళా అభ్య‌ర్థుల నుంచే 2.05 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చా‌యని వెల్ల‌డిం‌చారు. నిన్న ఒక్క‌రోజే ల‌క్ష మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు దరఖాస్తు గడువు పెంచడం, వయో పరిమితి పెంపుతో మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనున్నారు.