TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల… మే 7 నుంచి పరీక్షలు ప్రారంభం

మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌కు సంబంధించిన పరీక్షలు మే 7-9 వరకు జరుగుతాయి.

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల… మే 7 నుంచి పరీక్షలు ప్రారంభం

TS EAMCET 2023: తెలంగాణలో ఎంసెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 28న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది.

Marriage In Hospital: ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్న జంట.. కారణమేంటంటే..

మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌కు సంబంధించిన పరీక్షలు మే 7-9 వరకు జరుగుతాయి. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో జరుగుతాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలుకాగా, ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ సందర్శించాలి.