తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు!

తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు!

telangana EAMCET : తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ మీడియట్ పరీక్షలను 70 శాతం సిలబస్ తో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విద్యారంగంపై పెను ప్రభావం చూపెట్టింది. కళాశాలలు, స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ఇంటర్ పరీక్షలను 70 శాతం సిలబస్ తో ఫైనల్ పరీక్షలు నిర్వహించి మిగతా 30 శాతం సిలబస్ ను అసైన్స్ మెంట్స్, ప్రాజెక్టుల రూపంలో బోధించారు.

ఇంటర్ సిలబస్ ఆధారంగా..ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. సిలబస్ తక్కువగా ఉండడంతో…విద్యార్థులపై భారం పడుతుందని అధికారులు భావించారు. ఎంసెట్‌ను కూడా అదే సిల‌బ‌స్‌తో నిర్వ‌హించేందుకు స‌న్నాహాకాలు చేస్తున్న‌ట్లు రాష్ర్ట ఉన్న‌త విద్యామండ‌లిలోని ఓ ఉన్న‌తాధికారి తెలిపారు. ఇంటర్ సిలబస్ కాపీ తమకు చేరిన తర్వాత ప్రభుత్వ అనుమతి తీసుకున్న అనంతరం ఎంసెట్ సిలబస్ ను ప్రకటిస్తామని వెల్లడించారు. ఇంటర్ టైం టేబుల్ విడుదలైన తర్వాత..ఎంసెట్ ఎంట్రెన్స్ షెడ్యూల్, జూన్ రెండో వారంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి.