Minister Sabita Indrareddy : మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కాన్వాయ్‌లోని పోలీస్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

Minister Sabita Indrareddy : మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabita

Minister Sabita Indrareddy humanity : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కాన్వాయ్‌లోని పోలీస్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వికారాబాద్‌ డెంటల్‌ హాస్పటల్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తుతెలియని కారు ఢీకొట్టింది.

ఆ సమయంలో అటుగా వస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కాన్వాయ్‌ని ఆపి గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారిని దగ్గరుండి తన కాన్వాయ్‌లోని పోలీస్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.