Telangana Ends Lockdown : మళ్లీ మునుపటి రోజులు, తెలంగాణలో అన్ లాక్..జాగ్రత్తలు తప్పనిసరి

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.

Telangana Ends Lockdown : మళ్లీ మునుపటి రోజులు, తెలంగాణలో అన్ లాక్..జాగ్రత్తలు తప్పనిసరి

Telangana Unlock

Telangana Ends Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఆదివారం నుంచి సినిమా హాళ్లు, పబ్‌లు, షాపింగ్ మాల్స్‌, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథావిధిగా మెట్రో, బస్సు సర్వీస్‌లు నడవనున్నాయి. అయితే సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని థియేటర్ల ఓనర్లు చెబుతున్నారు. రెండు రోజుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలవనున్న థియేటర్ ఓరన్స్‌ ఇదే అంశంపై చర్చించనున్నారు.

కరోనా సమయంలో కష్టాలు ఎదుర్కొంటున్న థియేటర్లకు గతంలో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయాలని కూడా థియేటర్ ఓనర్స్ కోరనున్నారు. మే 12 నుంచి జూన్‌ 19 వరకు అంటే.. 38 రోజులపాటు తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో.. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని రాష్ట్ర మంత్రివర్గం కోరింది.