TS Schools: జనవరి 30 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.

TS Schools: జనవరి 30 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్

Schools

TS Schools: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం అధికారిక ప్రకటన చేశారు. విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ స్పందిస్తూ విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంస్థలు చర్యలు చేపట్టాలని.. ఆమేరకు ఆన్ లైన్ లో తరుగతులను నిర్వహించుకోవాలి సూచించింది.

Also read: TS News: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి తెలంగాణ గవర్నర్ తమిళిసై

కాగా సంక్రాంతి సెలవులపై ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లిన నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు 15 నుండి 18 ఏళ్ల వయసున్న బాలబాలికలకు కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎస్ పేర్కొన్నారు. వాక్సినేషన్ కు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తగు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశించింది.

Also read: Congress MLA: కంగనా రనౌత్ బుగ్గల్లాంటి నున్నని రోడ్లు వేస్తా: ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే