Telangana Farmer : పోలీసు కాళ్లపై పడ్డ రైతు..ధాన్యానికి నిప్పు

తెలంగాణా జిల్లాలోని వికారాబాద్ జిల్లాలో పాలెపల్లి గ్రామంలో ఓ రైతు తాను కష్టపడి పండించి ధాన్యాన్ని నడిరోడ్డుమీద పోసి నిప్పు పెట్టాడు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటంతో ఓ రైతు పోలీసు కాళ్లమీద పడ్డాడు. ఓ వైపు పెరిగిపోతున్న పంట పెట్టుబడులు..మరోవైపు పండించిన పంటకు దక్కని గిట్టుబాటు ధర..దీంతో రైతుల కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.

Telangana Farmer : పోలీసు కాళ్లపై పడ్డ రైతు..ధాన్యానికి నిప్పు

Farmers Protest (2)

Farmers Protest in Vikarabad district : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక..వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను ఏం చేయాలో తెలియని రైతన్నల్లు అంగలారుస్తున్నారు. ఓ వైపు భారీగా పెరిగిపోతున్న పంట పెట్టుబడులు..మరోవైపు పండించిన పంటకు దక్కని గిట్టుబాటు ధర వెరసి రైతన్న కష్టాల సుడిగుండంటోచిక్కుకుని అల్లాడిపోతున్నాడు. భూమిని సాగు చేసి పంటలు పండించి అందరి కడుపులు నింపే రైతన్నకు మాత్రం కష్టాలు తప్పటంలేదు.

రైతు కుటుంబానికి న్యాయం జరగటంలేదు. ఇటువంటి దుర్భర స్థితితో ఓ రైతన్నలు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఫలితం దక్కటం లేదు. ఈక్రమంలో తెలంగాణా జిల్లాలోని వికారాబాద్ జిల్లాలో పాలెపల్లి గ్రామంలో ఓ రైతు తాను కష్టపడి పండించి ధాన్యాన్ని నడిరోడ్డుమీద పోసి నిప్పు పెట్టాడు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు నిప్పు పెడితే ఆ రైతు భాద..ఆవేదన ఎలా ఉంటుందో పంట పండించిన రైతుకు మాత్రమే తెలుస్తుంది.

పండించి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గత మూడు రోజులుగా అన్నదాతను పాలెపల్లి ధాన్య కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. కానీ అధికారులకు ఏమాత్రం పట్టలేదు. మరో పక్క ఆందోళన చేసే రైతును పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆందోళన విరమించాలని చెబుతున్నారు. ఈక్రమంలో ఓ రైతు పోలీసులు కాళ్లమీద పడి తమకు న్యాయం చేయాలని..తమ పంటకు గిట్టుబాటు ధర కోసం మేం ఆందోళన చేస్తున్నాయ్యా..ఈ హక్కు కూడా మాకు లేదా? అంటూ పోలీసుల కాళ్లమీద పడిన ఘటన గుండెల్ని పించేస్తోంది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం లేదని వాపోతున్న సాటి రైతన్నలు. పోలీసులు కాళ్లమీద పడిన రైతు ఆవేదన భరించలేదక స్పృహ తప్ప నడిరోడ్డుమీద పడిపోయిన ఘటన స్థానికంగా కంటతడి పెట్టిస్తోంది. తమ ధాన్యాన్ని కొని మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.