Harish Rao : బీజేపీ గాలిని కూడా అమ్ముతుందేమో : హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దేశ ప్రజలను వంచిస్తోందన్నారు. ఆ పార్టీ ఏ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు.

Harish Rao : బీజేపీ గాలిని కూడా అమ్ముతుందేమో : హరీష్ రావు

Harish Rao

Harish Rao criticizes BJP : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దేశ ప్రజలను వంచిస్తోందన్నారు. ఆ పార్టీ ఏ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలతోపాటు అన్ని అమ్ముతున్న బీజేపీ చివరకు గాలిని కూడా అమ్ముతుందేమోనని అన్నారు. మోడల్ స్కూళ్లను నాశనం చేస్తోంది బీజేపీ, కాపాడింది టిఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన PRTU కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు కృతజ్ఞతతో ఉండడం అనేది, ఒక మంచి దృక్పథం అన్నారు. అలాంటివి చేసినప్పుడు రాజకీయ నాయకులుగా తమకు కొంత ప్రోత్సాహించినట్లు అవుతుందన్నారు. PRCని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. కరోనా వల్ల కొంత ఆలస్యము జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి PRC ఇవ్వాల్సి ఉన్నా, 7.5 శాతం ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్లకే 30 శాతం ఇచ్చిందని గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కువ జీతాలు, PRC ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తేల్చి చెప్పారు.

గతంలో కరెంట్, మంచినీళ్ల గురించి శాసనసభ సమావేశం మొదటి రోజుల్లోనే నిరసన ఉండేదన్నారు. ఇప్పుడు అలాoటి సమస్యలు ఉన్నాయా అని అన్నారు. మనం పక్క రాష్ట్రానికి కరెంట్ అమ్ముతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పారు. రోడ్ల వ్యవస్థను మెరుగు పర్చామని తెలిపారు.

దేశంలో వడ్లు అత్యధికంగా పండించిన రాష్ట్రంగా తెలంగాణ, పంజాబ్ రాష్ట్రం రెండవ రాష్ట్రంగా ఉందన్నారు. దేశంలో మన స్థానం ఎక్కడికి వెళ్ళింది, 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన ఘనత తెలంగాణదేనని చెప్పారు. గతంలో తెలంగాణ వృద్ధి 5 శాతం నుండి 9 శాతానికి పోయామని తెలిపారు. భారతదేశంలో తెలంగాణ వృద్ధి మూడవ స్థానంలో ఉందన్నారు. కొత్త జిల్లాలు, ఐటి పార్క్ లతో అభివృద్ధి సాధిస్తుందన్నారు.

ఈటెల రాజేందర్ దేని కోసం రాజీనామా చేశారని ప్రశ్నించారు. వ్యక్తి కోసం ఉంటారా! వ్యవస్థ కోసం ఉంటారా…హుజురాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజేందర్ గెలిస్తే ఆయనకు, బీజేపీకి లాభం, టిఆర్ఎస్ ను గెలిపిస్తే హుజూరాబాద్ కు లాభమన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, మేధావులు గ్రహించాలన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. పేదలు, సంక్షేమం కోసం పని చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని కోరారు. కుట్టు మిషన్లు, కుంకుమ భరణి, బొట్టు బిల్లలు ఇవ్వడం ఈటెల ఆత్మ గౌరవం అంటారా అని నిలదీశారు.