Telangana budget 2023-24 : నేడే తెలంగాణ బడ్జెట్ 2023-24.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ కు రెడీ అయింది. 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ను ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఉదయం 10:30 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Telangana budget 2023-24 : నేడే తెలంగాణ బడ్జెట్ 2023-24.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు

budget

Telangana budget 2023-24 : తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ కు రెడీ అయింది. 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ను ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఉదయం 10:30 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అటు శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న ప్రగతి భవన్ లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ పై కేబినెట్ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. శాఖలు, పథకాల వారిగా కేటాయింపులను మంత్రులకు వివరించారు. వారు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. మంత్రుల సూచనల ఆధారంగా ఆర్థిక శాఖ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేస్తోంది. శాసన సభకు బడ్జెట్ ను ఇవాళ సమర్పించనుండగా ఈ నెల 8న చర్చ జరుగనుంది.

అదే రోజు మంత్రి హరీష్ రావు వివరణ ఇవ్వనున్నారు. ఇక కేంద్ర గ్రాంట్లు, పన్నుల్లో వాటా, రానున్న ఎన్నికలు, కొత్త పథకాలు, పాత పథకాలకు కేటాయింపులు, రాబడులు, వ్యయాల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరికి కాదనకుండా, లేదనకుండా బడ్జెట్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిష్టాత్మక పథకాలకు సరిపడ నిదులను కేటాయంచినట్లు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ బాహుబలి బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. 2023-24 సంత్సరానికి గానూ దాదాపు 3 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది.

Telangana Assembly sessions : ఈనెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

వివిధ శాఖల నుంచి భారీగా ప్రతిపాదనలు రావడం కూడా ప్రభుత్వం భారీ బడ్జెట్ ను రూపొందించడానికి కారణంగా తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 2 లక్షల 56 వేల 958.5 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇది అత్యంత భారీ పద్దు అని అప్పట్లో చర్చ జరిగింది. కానీ వాస్తవ వ్యయాలకు వచ్చే సరికి కోతలు పడబోతున్నాయని ఈ సారి పూర్తి వ్యయం 1.80 నుంచి 1.90 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఈ సారి వాస్తవాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెడుతుందా అన్న చర్చ విస్తృతంగా జరిగింది. గిరిజన బంధు పథకానికి చోటు దక్కుతుందని తెలుస్తోంది.

అలాగే దళిత బంధుకు ఈసారి కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల సంవత్సరం కావడంతో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా అవరించిన సర్కార్ ఆర్థిక పద్దును ఎలా తీర్చిదిద్దుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలు తమకేమైనా కొత్త తాయిలాలు అందుతాయా అని ఆశపడుతున్నారు. అయితే ఈసారి వ్యవసాయం, సంక్షేమంతోపాటు గృహ నిర్మాణ రంగానికి కూడా సర్కార్ భారీగా నిధులను కేటాయించినట్లు చర్చ జరుగుతోంది. విద్యా, వైద్య రంగాలకు న్యాయం చేసినట్లుగా తెలుస్తోంది.