Monkeypox : మంకీపాక్స్ పై అలర్టైన తెలంగాణ-21 రోజులు ఐసోలేషన్

ప్రపంచంలోని 12 దేశాల్లో వ్యాపించిన మంకీ పాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.

Monkeypox : మంకీపాక్స్ పై అలర్టైన తెలంగాణ-21 రోజులు ఐసోలేషన్

Monkey Pox

Monkeypox :  ప్రపంచంలోని 12 దేశాల్లో వ్యాపించిన మంకీ పాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్ కు చికిత్స అందించేందుకు మందులు సిధ్దం చేసుకోవాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మంకీ పాక్స్ లక్షణాలు : జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం.
అనుమానితులు ఎవరంటే..?: అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్‌ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు.
చికిత్స: అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి ఐసొలేషన్‌లో ఉంచాలి. చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స అందించాలి. ఇతరులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు : పరీక్షల నిమిత్తం ఉమ్మి, రక్తం, రక్తనాళాల్లోని ఇతర ద్రవాల శాంపిళ్లను సేకరించి పూణెలోని ఎన్‌ఐవీకి పంపాల్సి ఉంటుంది. అనుమానితుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా నిఘా అధికారి లేదా ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం అధికారికి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ పాజిటివ్‌ కేసు నమోదైతే కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలి. బాధితులు గత 21 రోజుల్లో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో గుర్తించి వారిని ఐసొలేట్‌ చేయాలి.

భయం వద్దు : మంకీపాక్స్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్‌సీడీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని తెలిపింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే తీవ్రత పెరుగుతుందని చెప్పింది. మరణాల రేటు 1-10 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.

ఈ వైరస్‌ జంతువు నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి సోకుతుంది. స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. చర్మం నుంచి వెలువడే ద్రవాలు, తుంపర్లు, కండ్లు, ముక్కు, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉన్నది. బాధితులు తాకిన వస్తువుల ద్వారా కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది. ఎలుకలు, ఉడుతలు, పెంపుడు జంతువుల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.

వైరస్‌ సోకిన జంతువులు కరిచినప్పుడు మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. 7-14 రోజులు ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. 5-21 రోజుల్లో లక్షణాలు బయటపడుతాయి. అమ్మవారు (స్మాల్‌పాక్స్‌) సోకినప్పుడు చేసే చికిత్సనే మంకీపాక్స్‌కు అందిస్తారు. స్మాల్‌పాక్స్‌ ఔషధాలు 85 శాతం ప్రభావాన్ని చూపుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి.

Also Read : Minister Bosta: వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నాడు.. ఈసారి టీడీపీ తుడిచిపెట్టుకొని పోవటం ఖాయం