Telangana Govt : డ్రగ్స్‌ దందాపై కేసీఆర్‌ సర్కార్‌ ఉక్కుపాదం.. కట్టడి కోసం కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌

డ్రగ్స్‌ దందాపై టీసర్కార్ ఉక్కుపాదం మోపనుంది. డ్రగ్స్‌ కట్టడిలో ఎంతటివారినైనా వదలొద్దని కేసీఆర్‌ ఆదేశించారు. నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా తిరస్కరించాలన్నారు.

Telangana Govt : డ్రగ్స్‌ దందాపై కేసీఆర్‌ సర్కార్‌ ఉక్కుపాదం.. కట్టడి కోసం కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌

Cm Kcr

counter intelligence team to control Drugs‌ : తెలంగాణలో పెరుగుతున్న డ్రగ్స్ క‌ల్చర్‌కు బ్రేక్‌లు వేసేందుకు కేసీఆర్ స‌ర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపేందుకు ఏకంగా 1000 మందితో కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ టీమ్‌ను నియ‌మించింది. డ్రగ్స్ దందాలో రాజకీయ నేతలు, వ్యాపారులు, సినీరంగం ప్రముఖులు ఉన్నట్లు పెడ్లర్ టోనీ అరెస్ట్‌తో బ‌య‌ట‌ ప‌డింది. దీంతోపాటు.. ఉన్నత వ‌ర్గాల‌కు చెందిన వంద మందికి పైగా పిల్లలు.. డ్రగ్స్ బానిస‌లుగా ఉన్నట్లు ఇంట‌లీజెన్స్ రిపోర్ట్ లో బ‌య‌ట‌ప‌డింది. అంతేకాదు.. హైద‌రాబాద్ లో ఓ ప్రముఖ పొలిటీష‌న్ చెందిన హోట‌ల్ డ్రగ్స్ దందాకు అడ్డాగా మారిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అల‌ర్ట్ అయిన స‌ర్కార్.. డ్రగ్స్ ను కూక‌టి వేళ్ళతో స‌హా నిర్మూలించేందుకు న‌డుబింగించింది.

డ్రగ్స్‌ దందాపై కేసీఆర్‌ సర్కార్ ఉక్కుపాదం మోపనుంది. డ్రగ్స్‌ కట్టడి విషయంలో ఎంతటివారినైనా వదలొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా.. తిరస్కరించాలన్నారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా సరే వదలొద్దన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌.. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అసలు డ్రగ్స్ మాట వినిపించకూడదంటున్న సీఎం కేసీఆర్‌.. తేడా వస్తే తాట తీసేందుకు కూడా వెనకాడొద్దంటూ ఆదేశాలిచ్చారు.

Selfie Suicide : ప్రేమ పేరుతో అమ్మాయి మోసం.. యువకుడు సెల్ఫీ సూసైడ్

మరోవైపు డ్రగ్స్ కేసుల కీలక నిందితుడు టోనీని పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో డ్రగ్స్‌ నిరోధానికి ద్విముఖ వ్యూహాన్ని సర్కార్‌ అమలు చేయనుంది. ఒకవైపు డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేస్తూనే… మరోవైపు మాదక ద్రవ్యాలకు అడిక్ట్‌ అయిన వారిని గుర్తించనుంది. డ్రగ్స్‌, గంజాయికి అడిక్ట్‌ అయినవారి కుటుంబ సభ్యుల సహకారంతో డీ అడిక్ట్‌ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్కాట్‌లాండ్‌ తరహా డ్రగ్‌ కంట్రోలింగ్‌ చేపట్టాలని సూచించారు.

అవసరమైతే డ్రగ్‌ కంట్రోల్‌ చేస్తున్న దేశాల్లో పోలీసులు పర్యటించాలన్నారు. డ్రగ్స్‌ వాడకాన్ని నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌.. పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్‌ వినియోగించినట్లు తేలితే.. ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులనూ పట్టించుకోవద్దన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ఆదేశించారు.

Mobile Recharge Plans : ఇకపై 28 రోజులు కాదు.. 30 రోజులు, మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ పెంచాలని ట్రాయ్ ఆదేశం

డ్రగ్‌ నేరస్థులపై నమోదైన కేసులు… కోర్టుల్లో వీగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం కేసీఆర్‌. నైజీరియా నుంచి వచ్చి నేరాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. డ్రగ్స్‌ను నియంత్రించడానికి ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. మీడియా, సినిమా మాధ్యమాలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, యాడ్స్‌కు సబ్సిడీ కూడా ఇవ్వాలని సూచించారు కేసీఆర్‌. ఇక గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తే.. ఈ గ్రామంలోని రైతులందరికీ రైతుబంధు నిధులు ఇవ్వకూడదని కూడా నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందితో కూడిన ప్రత్యేక నార్కోటిక్‌ అండ్‌ ఆర్గనైజ్‌డ్‌ క్రైం కంట్రోల్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు బాగా పని చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అదే మాదిరిగా నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ఆక్సెలరేషన్ ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.