Telangana Government: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. | Telangana Government Approves Filling Of Another 10 Thousand Jobs

Telangana Government: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విధితమే. తాజాగా రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి.

Telangana Government: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విధితమే. తాజాగా రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉత్తర్వుల విషయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.

తాజాగా జారీ చేసిన ఉత్వర్వుల ప్రకారం.. గురుకులాల్లో 9,096 పోస్టులు ఉన్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయ సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

CM Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 8వేల పోస్టుల భర్తీకి ఆదేశం

ఇక ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా శిశు సంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగ శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చామని, త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని హరీష్ రావు తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.

×