Whatssapp Complaint : కరోనాకి ప్రైవేట్‌లో అధిక ఫీజులా? ఈ వాట్సాప్ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు తీసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు సిద్ధమైంది. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ ను ప్రభుత్వం బుధవారం(మే 19,2021) ప్రకటించింది.

Whatssapp Complaint : కరోనాకి ప్రైవేట్‌లో అధిక ఫీజులా? ఈ వాట్సాప్ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి

Whatsapp Number For Complaints

Whatsapp Number For Complaints : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు తీసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు సిద్ధమైంది. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ ను ప్రభుత్వం బుధవారం(మే 19,2021) ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేయడానికి 9154170960 వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా కేసులపై విచారణ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై మండిపడింది. దీంతో ప్రభుత్వం ఈ విషయమై చర్యలకు ఉపక్రమించింది.

ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వైద్యానికి ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. కరోనాతో చికిత్స పొందుతూ రోగి మరణిస్తే, ఫీజు చెల్లించే వరకు డెడ్ బాడీ కూడా ఇచ్చేది లేదంటున్నాయి. ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలు దుమారం రేపాయి. ఇవి హైకోర్టు దృష్టికి వెళ్లాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఆ వెంటనే కరోనా చికిత్సకి ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. ఈ ధరల ప్రకారంగా ఫీజులను వసూలు చేయాలని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఆదేశించింది. ఆ ధరల కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రుల గురించి తాము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలంది.