Telangana : ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్‌!

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్‌ చార్జీలు, రోడ్ టాక్స్ పై వంద శాతం రాయితీ ఇస్తుంది.

Telangana : ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్‌!

Telangana

Telangana : ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వేగవంతమైన మార్పులు వస్తుండటంతోపాటు..ఖర్చు తగ్గుతుండటంతో కొత్త వాహనాలు కొనాలి అనుకునే వారు ఈవీలపైనే దృష్టి పెడుతున్నారు. ప్రతి నెల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగం పెరుగుదలకు ప్రభుత్వాలు కూడా సాయం చేస్తున్నాయి. పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడంతో, వాయుకాలుష్యం నానాటికి అధికమవుతుండటంతో ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనీ ప్రజలకు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరో ముందడుగు వేసి రాయితీలు ప్రకటిస్తున్నాయి. రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుపై మినహాయింపు ఇస్తున్నాయి.

ఆ జాబితాలో 8వ వాడిగా నిలిచిన రోహిత్ శర్మ

తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తరహాలోనే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రాయితీలు ప్రకటించింది. రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ని రూపొందించింది. 2020లో ఈ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, వ్యక్తిగత, వాణిజ్య రంగాల్లో రవాణా ఖర్చు తగ్గింపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేళ్ల పాటు కొత్త పాలసీ పనిచేస్తుంది. ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. తొలి విడతలో తయారయ్యే రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటో రిక్షాలు, 5వేల కార్లు 500 ఎలక్ట్రిక్‌ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీ వంద శాతం ఉచితం.

ఫ్లిప్‌కార్ట్‌కు ఈడీ నోటీసులు.. రూ.10.600 కోట్ల జరిమానా

నిరుద్యోగులకు వెనుకబడిన వర్గాల వారికోసం మరో రాయితీ తెచ్చింది.. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే స్వయం ఉపాధి పథకాల కింద ఆర్ధిక సాయం అందిస్తారు. ఇక వ్యవసాయంలో ప్రస్తుతం డీజిల్ తో నడిచే ట్రాక్టర్లే ఉన్నాయి. వీటితో వ్యవసాయం రైతులకు భారంగా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ ట్రాక్టర్లకు రవాణా శాఖ నిబంధనలకు లోబడి వంద శాతం రోడ్‌ టాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తుంది.

ఐ‌ఫోన్‌తో కేక్‌కట్ చేసిన కుమారుడు.. వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!

నగరంలో డీజిల్, పెట్రోల్ వాహనాలను తగ్గించి, పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను నడపడం.. నగర నలుమూలల నుంచి హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు నడపడం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో దశల వారీ చార్జింగ్‌ స్టేషన్ల చేయడం. విద్యుత్‌ వాహనాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం. రూ.200 కోట్ల పెట్టుబడి, వేయి మందికి ఉపాధి కల్పించే మెగా కంపెనీలకు 20శాతం పెట్టుబడి రాయితీ. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, ఐదేళ్ల పాటు గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లు మించకుండా 25శాతం విద్యుత్‌ రాయితీ, ఐదేళ్ల పాటు విద్యుత్‌ సుంకం, స్టాంప్‌ డ్యూటీపై వంద శాతం రాయితీ ఇస్తుంది.