Telangana Government : రోజంతా తెరిచే ఉండనున్న పెట్రోల్ బంకులు

పెట్రోల్ బంకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 2021, మే 19వ తేదీ బుధవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Government : రోజంతా తెరిచే ఉండనున్న పెట్రోల్ బంకులు

Petrol

Telangana Government lockdown : తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 06 గంటల వరకు ఈ లాక్ డౌన్ అమల్లో కొనసాగనుంది. రోజులో కేవలం నాలుగు గంటలు మినహాయింపు ఉండడంతో ప్రజలు ఉదయాన్నే ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయితే..పెట్రోల్ బంకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 2021, మే 19వ తేదీ బుధవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వ్యవసాయ పనులపై ప్రభావం లేకుండా చేసేందుకు పెట్రోల్‌ బంకులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా…వానకాలం సీజన్ ప్రారంభం అవుతుండడంతో వ్యవసాయ పనులు ప్రారంభమౌతున్నాయి. ఈ క్రమంలో..ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు చేర్చడంలో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్‌ బంకులు రోజంతా తెరిచే ఉండనున్నాయి.

Read More : viral video : నడిరోడ్డుపై మహిళ జుట్టు పట్టి ఈడ్చి ఈడ్చి కొట్టిన పోలీసులు..