Dalitbandhu : తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు

దళితబంధు అమలుపై బీఆర్ కే భవన్ లో శనివారం (జనవరి 22, 2022) జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.

Dalitbandhu : తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు

Dalitbandhu (1) 11zon

Dalitbandhu implement throughout state : తెలంగాణలో వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లోనూ దళితబంధును అమలు చేయనుంది. దళితబంధు అమలును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దళితబంధు అమలుపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లలను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సూచనతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను జిల్లా ఇంచార్జీకి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి నెలలో 100 గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.

దళితబంధు అమలుపై బీఆర్ కే భవన్ లో శనివారం (జనవరి 22, 2022) జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. కాన్ఫరెన్స్ లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు అయ్యారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్.సి. కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుండి సి.ఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సి.ఎం. కార్యాలయం కార్యదర్శి, ఎస్.సి. అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్.సి కార్పొరేషన్ ఎం.డీ. కరుణాకర్ లు పాల్గొన్నారు.

AP High Court : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

దళిత బంధు అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 100 శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి, జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ఆమోదింప చేయాలని సూచించారు.

ప్రతీ లబ్ధిదారుడికీ ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందచేయనున్నారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్ నే ఎంపిక చేయాలన్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షల నుండి 10వేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు రూ. 1200 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశామని తెలిపారు.

Vinod Kumar Corona : తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా

విడతల వారీగా మిగతా నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే, వాసాల మర్రి, హుజురాబాద్ లలో దళిత బంధు అమలులో ఉంది. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతీష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఉప ఎన్నికలకు ముందు మొట్టమొదటగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేశారు. తర్వాత క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్న హామీ మేరకు తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు చేయనున్నారు. కాగా హుజూరాబాద్ లో దళితబంధును ప్రకటించిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.