Free Electricity Connections : ఆ విద్యుత్‌ కనెక్షన్లు తొలగించొద్దు.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశం

రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గురువారం(సెప్టెంబర్29,2022) ఆదేశాలు జారీ చేశారు.

Free Electricity Connections : ఆ విద్యుత్‌ కనెక్షన్లు తొలగించొద్దు.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశం

Free Electricity Connections : రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గురువారం(సెప్టెంబర్29,2022) ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బీసీ సంక్షేమశాఖ సహకారంతో 1,02,631 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయినప్పటికీ విద్యుత్‌ అధికారులు పలు చోట్ల బిల్లుల బకాయి పేరుతో ఉచిత్‌ కనెక్షన్లను తొలగిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉచిత విద్యుత్‌ పథకానికి సంబంధించిన కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్‌ చేయకూడదని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana : నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఫ్రీ..వారికి మాత్రమే

దీనిపై రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్‌ కొండూరు సత్యనారాయణ, నాయీ బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాసమల్ల బాలకృష్ణ, ఉపాధ్యక్షులు గడల రాజు, రాష్ట్ర నేతలు కోట్ల శ్రీనివాస్‌, ఎల్లంగౌడ్‌, పురోషోత్తం, ముదిగొండ మురళీ, చిట్యాల రామస్వామి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.