Endowment Department : దేవాదాయ శాఖకు రూ.126.21 కోట్లు విడుదల.. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖకు రూ.126.21 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్ లో భాగంగా ఈ నిధులను విడుదల చేసింది.

Endowment Department : దేవాదాయ శాఖకు రూ.126.21 కోట్లు విడుదల.. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

Endowment Department : తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖకు రూ.126.21 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్ లో భాగంగా ఈ నిధులను విడుదల చేసింది.

దేవాదాయ భూముల పరిక్షణకు ఫెన్సింగ్, ఇతర రక్షణ చర్యల కోసం కామన్ గుడ్ ఫండ్ కింద రూ.86.25 కోట్లు, 2,676 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల కోసం నాలుగో త్రైమాసిక బడ్జెట్ నుంచి రూ.13,91,91,000 ఆర్థిక సంవత్సరం చివరి వరకు అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల కోసం మరో రూ.26,05,00,000 విడుదల చేస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేసింది.

AP Endowment Commissioner : వినాయక మండపాల ఏర్పాటుకు డబ్బులు వసూలు..! క్లారిటీ ఇచ్చిన దేవాదాయ శాఖ

ఆలయ భూముల పరిరక్షణ కోసం దేవాదాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో భాగంగా ఆక్రమణల నుంచి కాపాడిన భూములను పకడ్బందీగా కంచే ఏర్పాటు చేస్తున్నారు.